పవన్ ఓ గజనీ

పవన్ ఓ గజనీ

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసిపి ఎంఎల్ఏ రోజా రెచ్చిపోయారు. పవన్ ను ఓ గజనీతో పోల్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పవన్ గజనీ కాకపోతే, నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసారు. పవన్ కల్యాణ్ చెప్పబట్టే పోయిన ఎన్నికల్లో కాపులు టిడిపి, భాజపాలకు ఓట్లేసినట్లు రోజా గుర్తుచేసారు. 

జగన్ పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ప్యాకేజీలో భాగమే అంటూ మండిపడ్డారు. పవన్ కు స్క్రిప్ట్ రాసే వ్యక్తికి సరైన అవగాహన లేకపోవటంతోనే సమస్యలు వస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ప్యాకేజీలు తీసుకునే వాళ్ళకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ధ్వజమెత్తారు. 

కొందరు పదవుల కోసమే పార్టీలు పెడతారంటూ పేరెత్తకుండానే పవన్ పై విరుచుకుపడ్డారు. రాజకీయ పార్టీ పెట్టటం కన్నా ఓ చారిటబుల్ ట్రస్టు పెట్టుకోవటం ఉత్తమం అంటూ పవన్ గాలి తీసేసారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos