అమరావతి: ఏపీలో కలకలం రేపిన తిరుమల శ్రీవారి నగల తరలింపు వ్యవహారంలో వస్తున్న ఆరోపణలపై విచారణ ముగిసింది. శ్రీవారి నగలు తరలింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. 

సీఎస్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి  మన్మోహన్ సింగ్ తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ సింఘాల్‌తో పాటు విజిలెన్స్‌, పీఎన్‌బీ అధికారులను విచారించారు. 

వారి దగ్గర నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించారు. ఆ నివేదికను మంగళవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు అందజేశారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్. 

ఈ వార్తలు కూడా చదవండి

బంగారం తరలింపు బాధ్యత పీఎన్‌బీదే..టీటీడీకి సంబంధం లేదు:సింఘాల్