కోడ్ ఉల్లంఘన కేసులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కోర్టులో ఊరట లభించింది. 2014 ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోడెల స్వయంగా వ్యాఖ్యానించారు.

దీనిపై సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ ఇంటర్వ్యూలో కోడెల చెప్పిన అంశాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించాడు. దీనిపై నాంపల్లిలోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు వివిధ సెక్షన్ల కింద విచారణ చేసింది.

అయితే ఈ కేసులో విచారణ నిలుపుదల చేయాలంటూ కోడెల హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ స్టే గత నెల 27తో ముగియగా.. అక్టోబర్ 10న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి కోడెలను ఆదేశించారు. దీనిపై ఇవాళ నాంపల్లి కోర్టు మరోసారి విచారణ జరపింది.. హైకోర్టు విధించిన స్టే ను ఈ నెల 23కు పోడిగించడంతో పాటు.. తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది. 

కోడ్ ఉల్లంఘన కేసులో కోడెలకు చుక్కెదురు