పొలిటికల్ పంచ్ గ్రూపులోని ప్రతీ పోస్టుకు తనదే బాధ్యతగా స్పష్టం చేసినట్లు కిరణ్ వెల్లడించారు. తన వెనుక ఎవరి ప్రమేయం లేదని మరోమారు స్పష్టం చేసారు.

‘పెద్దోళ్ళ జోలికి వెళ్ళ వద్దు. నీవు చెబితేనే జనాలకు నిజాలేమిటో తెలుస్తాయా’.. ఇది...పోలీసులు పొలిటికల్ పంచ్ గ్రూపు అడ్మిన్ రవికిరణ్ తో అన్న మాటలు. ‘నిజాలు బయటకు రాకూడదని ప్రభుత్వం అనుకుంటోందది.’ ఇంటూరి రవికిరణ్ అన్నమాటలు. ఎట్టకేలకు పొలిటికల్ పంచ్ రవికుమార్ విడుదలయ్యారు. రవికుమార్ ను అరెస్టు చేయగానే సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించిన విధానాన్ని గమనించిన ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

ఈనెల 25, 26 తేదీల్లో మళ్లీ తుళ్లూరు పోలీసు స్టేషన్ కు రావాలన్న షరతుపైనే పోలీసులు తనను వదిలిపెట్టినట్లు రవికిరణ్ చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసిన రవిని పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మందడంలోని ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళారట. తర్వాత వేర్వేరు వాహనాల్లోకి మారుస్తూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ తిప్పారట. అనంతరం, ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళి విచారించారు.

పొలిటికల్ పంచ్ గ్రూపు వెనుక ఎరున్నారు? గ్రూపుకు వైసీపీకి ఉన్న లింకేమిటి? అనే ప్రశ్నలు వేసినట్లు రవికిరణ్ పేర్కొన్నారు. పొలిటికల్ పంచ్ గ్రూపులోని ప్రతీ పోస్టుకు తనదే బాధ్యతగా స్పష్టం చేసినట్లు కిరణ్ వెల్లడించారు. తన వెనుక ఎవరి ప్రమేయం లేదని మరోమారు స్పష్టం చేసారు.