విజయవాడ:ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయలేకే తాను టీడీపీని వీడి జనసేనలో చేరినట్టుగా  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు.

జనసేన చీప్ పవన్ కళ్యాణ్ సమక్షంలో  రావెల కిషోర్ బాబు  శనివారం నాడు  జనసేనలో చేరారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు.పవన్  పోరాటంలో  తాను సమిధగా మారేందుకే జనసేనలో చేరినట్టు రావెల చెప్పారు. 

తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు చంద్రబాబునాయుడుకు రావెల కిషోర్ బాబు ధన్యవాదాలు చెప్పారు. మంత్రి పదవి ఇచ్చినా కూడ తనకు అధికారాలు ఇవ్వలేదని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతి, దుర్మార్గాలతో రాష్ట్రంలో రాజకీయాలు దిగజారాయని రావెల కిషోర్ బాబు  అభిప్రాయపడ్డారు.ప్రజాస్వామ్యం దోపీడీస్వామ్యంగా మారిందన్నారు. 
చంద్రబాబునాయుడు  తన కేబినెట్ నుండి   రావెల కిషోర్ బాబును  తప్పించడంతో    రావెల కిషోర్ బాబు  టీడీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రావెల కిషోర్ బాబు  తీరుతో పార్టీకి నష్టమని టీడీపీ నాయకత్వం భావించింది.

దరిమిలా రావెల కిషోర్ బాబు స్థానంలో  నక్కా ఆనంద్ బాబుకు చంద్రబాబునాయుడు మంత్రి పదవి కట్టబెట్టారు.  పార్టీ తీరుపై కొన్ని సమయాల్లో రావెల కిషోర్ బాబు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.కిషోర్ బాబు కూడ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. శనివారం నాడు ఆయన  జనసేనలో  చేరారు.

సంబంధిత వార్తలు

అందుకే ఆనాడు టీడీపీకి మద్దతిచ్చా: పవన్

బాబుకు షాక్: జనసేనలో చేరిన రావెల కిషోర్ బాబు

చంద్రబాబుకు ఝలక్: మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా