గుంటూరు:  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం నాడు  జనసేనలో చేరారు.  శుక్రవారం నాడే  రావెల కిషోర్ బాబు  టీడీపీకి రాజీనామా చేశారు.

2014 ఎన్నికల్లో రావెల కిషోర్ బాబు  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో రావెలకు చోటు దక్కింది. రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని  పార్టీ నాయకత్వం భావించింది. దీంతో  మంత్రివర్గం నుండి రావెల కిషోర్ బాబును  తప్పించారు.ఆయన స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన  నక్కా ఆనంద్‌బాబుకు చంద్రబాబునాయుడు మంత్రివర్గం నుండి  తనను తప్పించడంతో రావెల కిషోర్ బాబు  తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

గతంలో గుంటూరులో ఎమ్మార్పీఎస్ సభకు మద్దతుగా  రావెల కిషోర్‌బాబు వ్యవహరించాడని టీడీపీ నాయకత్వం భావించింది. ఈ పరిణామాలతో  రావెల కిషోర్ బాబు  పార్టీ కార్యక్రమాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.

మంత్రిగా ఉన్న కాలంలో వైసీపీపై, జగన్ పై రావెల కిషోర్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో  టీడీపీ నుండి తనకు స్థానం దక్కదని భావించడంతో పాటు ఇతరత్రా కారణాలతో రావెల కిషోర్ బాబు జనసేలో చేరారు. శనివారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో రావెల కిషోర్ బాబు జనసేన తీర్థం పుచ్చుకొన్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఝలక్: మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా