'అమరావతి' పేరు రామోజీ రావుదే...: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో రామోజీరావు ఏం సంబంధం..?  రాజధాని నిలిచివున్నంత కాలం రామోజీరావు పేరు నిలిచివుంటుందని ఎందుకు అంటున్నారు..?  అనేది తెలుసుకోవాలంటూ చంద్రబాబు వీడియో చూడాల్సిందే...

Ramoji Rao suggested Andhra Pradesh Capital Name as Amaravati : Chandrababu Naidu AKP

అమరావతి : మీడియా మొగల్, వ్యాపార దిగ్గజం రామోజీరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్ళుగా హాస్పిటల్లోనే వున్న ఆయన పరిస్థితి మరింత విషమించి తెల్లవారుజామున ప్రాణాలు వదిలారు. ఈ వార్త మీడియా, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులనే కాదు సామాన్య ప్రజలు సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలామంది రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తూనే ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.  

రామోజీరావుకు తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు వున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నుండి ప్రస్తుత టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు వరకు ఆయనతో మంచి స్నేహాన్ని కలిగివుండేవారు. ఇలాంటి తమ శ్రేయోభిలాషి రామోజీరావు మరణవార్త తెలియగానే డిల్లీలోనే ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు చంద్రబాబు నాయుడు.

అయితే రామోజీరావు గొప్పతనం గురించి గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర  రాజధాని హైదరాబాద్ ను కోల్పోవాల్సి వచ్చింది... దీంతో కొత్త రాజధాని నిర్మాణానికి తాను పూనుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇలా ఏర్పాటుచేయబోయే రాజధానికి ఏ పేరు పెట్టాలా అని తర్జనభర్జన పడ్డాను... చాలా మంది చాలా పేర్లు సూచించారని గుర్తుచేసారు. ఈ సమయంలోనే 'అమరావతి' పేరును రామోజీరావు సూచించారు... అది తనకెంతో నచ్చిందన్నారు. ఎవ్వరిని అడిగినా ఈ పేరే అద్భుతంగా వుందన్నారు... దీంతో అధికారికంగా ప్రకటించినట్లు చంద్రబాబు తెలిపారు.

 

ఇలా ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి అమరావతి అని పేరు పెట్టింది రామేజీరావు అని చంద్రబాబు బయటపెట్టారు. దీంతో రామోజీరావును అభిమానించేవారు ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ... ''ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి వున్నంతకాలం రామోజీరావు పేరు నిలిచివుంటుంది'' అని అంటున్నారు. రామోజీరావు గొప్పతనాన్ని తెలియజేస్తూ చంద్రబాబు మాట్లాడిన వీడియో ఇప్పుడు మళ్ళీ బయలకువచ్చింది. 


 
 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios