ప్రియుడితో నన్ను చంపిస్తోంది: సెల్ టవరెక్కి భర్త ఆత్మహత్యాయత్నం

Ramachandra  suicide attempt  in Chittoor district
Highlights

లవర్‌తో నన్ను చంపేందుకు కుట్ర

చిత్తూరు:  ప్రియుడితో కలిసి తనను  తన భార్య హత్య చేస్తోందనే భయంతో  రామచంద్ర
అనే వ్యక్తి  సెల్‌టవర్ ఎక్కి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని
చాకచక్యంగా సెల్‌టవర్ నుండి కిందకు దింపారు. రామచంద్ర కుటుంబసభ్యులకు
పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటన  చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

చిత్తూరు జిల్లా  దండువారిపల్లికి చెందిన  రామచంద్రకు  పదేళ్ళ క్రితం ఓ యువతితో
వివాహమైంది. వీరిద్దరికి 8 ఏళ్ళ కూతురు కూడ ఉంది. అయితే మరో వ్యక్తితో తన భార్యతో  
వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని  రామచంద్ర ఆరోపిస్తున్నాడు. తన భార్య, ఆమె
ప్రియుడు తనను హత మారుస్తామని బెదిరిస్తున్నారని రామచంద్ర చెబుతున్నారు.


ప్రియుడితో కలిసి తన భార్య ఆరు మాసాల క్రితం ఇంటి నుండి కూడ పారిపోయిందని
ఆయన గుర్తు చేశారు.  తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు. ప్రియుడితో కలిసి తనపై తన భార్య రెండు దఫాలు దాడి చేయించిందని ఆయన
ఆరోపించారు.మరోసారి బెదిరింపులు రావడంతో మనస్థాపానికి గురైన  రామచంద్ర  
గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కి   ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు
అతడిని వారించారు.

ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు  సంఘటనాస్థలానికి చేరుకొని  రామచంద్రను
సెల్‌టవర్ దిగాలని కోరారు. నాలుగు గంటలపాటు రామచంద్ర పోలీసులను  
ఇబ్బందిపెట్టారు. ఈ తరుణంలో  నలుగురు గ్రామస్థులను టవర్ పైకి పంపి  రామచంద్రను
 కిందకు తీసుకొచ్చారు.


 

loader