కట్టి నాలుగైదు నెలలు కాలేదు, విజయవాడ కొత్త ఆర్టీసి భవన్ ఈ రోజు కురిసిన వానకు కారుతూ ఉంది
విజయవాడ ఆర్ టిసి భవన్ ను ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ గా ప్రారంభించి నాలుగు నెలలే అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్టహాసంగా జూన్ లో ప్రారంభించారు. ఈ బిల్డింగ్ లో ఈ రోజు ఎస్సి ఎస్టి కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం కావలసి ఉంది. మంత్రి నక్కాఆనంద్ బాబు కార్యక్రమానికి రావాలి. అయితే, ప్రారంభం కాక ముందే కార్యాలయంలోకి వర్షపు నీరు లీకవడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ రోజు ఉదయం నుంచి విజయవాడలో భారీగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. కొత్తలోనే ఇలా నీరు ఇంకడం వల్ల భవనాన్ని ఎంత హడావిడి కట్టారో తెలుస్తుంది. మంత్రి రాకను పురష్కరించుకుని సిబ్బందిని రంగంలోకి దించి వాన నీళ్లను హడావిడిగా తడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
