Asianet News TeluguAsianet News Telugu

కొంపలోనే ఉంటున్నారు, ఎందుకు భయం: జగన్ మీద రఘురామ ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు తీవ్రంగా మండిపడ్డారు. సెక్యూరిటీ లేకుండా అసెంబ్లీకి వెళ్లడానికి అమరావతి రైతుల ఉద్యమం వల్ల జగన్ భయపడుతున్నారని ఆయన అన్నారు.

Raghurama Krishnama Raju questions YS Jagan on Amaravati farmers
Author
New Delhi, First Published Oct 14, 2020, 8:19 AM IST

న్యూఢిల్లీ: అమరావతి రైతుల ఆందోళనపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. అమరావతి రైతులను చులకన చేస్తూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాసం రాశారని ఆయన అంటూ దానిపై తీవ్రంగా మండిపడ్డారు. 

రైతులు ఎంతో త్యాగం చేసి, దాదాపుగా దానం చేసినట్లు భూములు ఇస్తే పనికిమాలిన ఆషాఢభూతి మాటలు మాట్లాడడం దురదృష్టకరమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గాంధీ స్ఫూర్తితో రైతులు ఉద్యమం చేస్తున్నారని, అన్ని ఊళ్లలోనూ అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. 

Also Read: అతి త్వరలో ఏపీలో రాష్ట్రపతి పాలన: రఘురామ కృష్ణంరాజు సంచలనం

అసలు భద్రత లేకుండా అసెంబ్లీకి వెళ్లగలరా అని రఘురామకృష్ణమ రాజు వైఎస్ జగన్ ను నిలదీశారు. నిజంగానే అక్కడున్నవాళ్లు మేకప్ ఆర్టిస్టులైతే అసెంబ్లీకి వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సెక్యూరిటీ లేకుండా మీరు వెళ్లగలరా, గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని ఆయన జగన్ ను డిమాండ్ చేశారు. 

కొంపలోనే ఉంటున్నారు కాదా, ఎందుకు భయపడుతున్నారని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. నిస్సిగ్గుగా, దారుణంగా 30 మందికే ఉద్యమం పరిమితమని ఎలా అనగలుగుతున్నారని ఆయన అడిగారు. అటువంటి ఉద్యమం జరుగుతుంటే ఏమీ తెలియనట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉద్యమకారులను అవమానించడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు 

చిన్న, సన్నకారు రైతులు భూములు ఇస్తే రైతులను ఆ రకంగా అవమానిస్తారా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రిగారూ... మీ పేరుతో అవమానిస్తున్నారని, దళితుకు మీకు మధ్య అగాధం పెరిగిపోయిందని రఘురామకృష్ణమ రాజు అన్నారు. జగన్ కు ప్రేమ ఉన్నదని ఇన్నాళ్లు తాను అనుకున్నానని ఆయన అన్నారు. డ్రామా, మేకప్ అర్టిస్టులంటూ సజ్జల అవమానించడం దారుణమని, ప్రజలకు జగన్ ను దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios