న్యూఢిల్లీ: మాన్సస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజుపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు సంచయిత మాన్సస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా అనర్హురాలనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఆనంద గజపతి రాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతి రాజు విడాకులు తీసుకున్న తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారని చెప్పారు. 

ఆ తర్వాత కొద్ది రోజులకే  ఉమ రమేష్ శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారని, 2013లో సంచియత రాసిన ఓ ఆర్టికల్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోందని రఘురామకృష్ణమ రాజు సోమవారం మీడియాతో చెప్పారు. ఢిల్లీలో చదువుకున్న సంచయిత తన తండ్రి రమేష్ శర్మ అని రాశారని చెప్పారు. 

Also Read: సిరిమానోత్సవంలో అవమానించారు: ఊర్మిళ గజపతిరాజు

తల్లితో తండ్రి విడాకులు తీసుకున్న తర్వాత ఆయన చనిపోతే కనీసం చూడడానికి కూడా రాలేదని, పూర్తిగా దూరమయ్యారని ఆయన చెప్పారు. ఆనంద గజపతి రాజు కూడా మరో వివాహం చేసుకున్నారని, వారికి పుట్టిన అమ్మాయి ఊర్మిళ గజపతి రాజునే వారసురాలిగా ప్రకటిస్తూ ఆనంద గజపతి రాజు వీలునామాలో రాశారని ఆయన చెప్పారు. 

ఊర్మిళ గజపతిరాజు టీవీల్లో మాట్లాడుతుంటే చూశానని, చక్కగా మాట్లాడిందని, సంచయిత వివాదంపై కోర్టుకు వెళ్తున్నట్లు తెలిపిందని ఆయన అన్నారు. వారి కుటుంబానికి చెందిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అవమానించే కుసంస్కారం రాజవంశీయులకైతే ఉండదని ఆయన అన్నారు. 

Also Read: సిరిమానోత్సవం: పూసపాటి వంశీయుల పంచాయితీ

ఎవరి అండనో చూసుకుని చెలరేగిపోతే రేపో మాపో కోర్టు ఆదేశాలు వస్తాయని ఆయన అన్నారు. "అమ్మా... సంచయితా.. నిన్ను అడ్డం పెట్టుకుని ఆస్తులు చేజిక్కించుకోవడానికి... పం గ్రామాల్లోనే కాదు... మాన్సస్ ట్రస్టుకు చెందిన ఆస్తులను కాజేయడానికి చూస్తున్నారు. వారి ట్రాప్ లో పడొద్దు.. ఆస్తులు రక్షించుకోండి" అని రఘురామ కృష్ణమ రాజు అన్నారు.