విజయనగరం: పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ  జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

పైడితల్లి సిరిమానోత్సవాన్ని చూసేందుకు ఆనందగజపతిరాజు భార్య సుధ, కూతురు ఊర్మిళ .... కోటపై కూర్చున్నారు. అయితే ఈ ఇద్దరిని కోటపై నుండి కిందకు దింపాలని సంచయిత గజపతిరాజు పోలీసులను కోరారు.

అయితే కోట నుండి కిందకు వెళ్లమని తాము వారికి చెప్పలేమని సంచయితకు పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో కోటపై మరోవైపు కుర్చీ వేసుకొని సంచయిత కూర్చొని ఉత్సవాన్ని తిలకించింది.పోలీసులతో తమను కోటపై నుండి కిందకు దించాలని సంచయిత చెప్పడంతో  కొద్ది సేపటి తర్వాత ఊర్మిళ ఆమె తల్లి సుధలు కోట నుండి వెళ్లిపోయారు.

పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా జరిగిన ఘటనను నిరసిస్తూ బుధవారం నాడు ఆనందగజపతి రాజు రెండో భార్య సుధ, కూతురు మౌనం పాటించారు. ఆనందగజపతిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సిరిమానోత్సవాన్ని కోటపై  సందర్శించే సంప్రదాయం కొన్ని దశాబ్దాల పాటు నుండి వస్తోంది. అయితే ఎవరిని కూడ కోటపైకి రాకుండా తలుపులు మూసేయాలని అధికారులకు సంచయిత చెప్పారు.

దేవాదాయశాఖ అధికారులను పిలిచి కోటపై కూర్చొన్న ఊర్మిళ, ఆమె తల్లి సుధను కిందకు పంపేయాలని చెప్పించారు. దీన్ని అవమానంగా భావించి .. బంగ్లాలోకి వెళ్లిపోయారు. దీన్ని నిరసిస్తూ ఇవాళ ఆనందగజపతిరాజు విగ్రహం వద్ద మౌనం పాటించారు.