విజయనగరం: సిరిమానోత్సవంలో తమను అవమానించారని ఆనందగజపతిరాజు కూతురు ఊర్మిళ గజపతిరాజు చెప్పారు. గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు గాను కోటపై ముందు వరుసలో నుండి వెళ్లిపోవాలని ఆదేశించారన్నారు.

తమను కోటలోకి ఎవరు అనుమతించారని కోటలో పనిచేసే సిబ్బందిని నిలదీశారన్నారు. అంతా తానే అన్నట్టుగా సంచయిత వ్యవహరిస్తున్నారన్నారు. మాన్సాస్ తన స్వంత సంస్థలా అధికారం చెలాయిస్తున్నారని ఆమె పరోక్షంగా సంచయితపై ఆమె మండిపడ్డారు.

also read:సిరిమానోత్సవం: పూసపాటి వంశీయుల పంచాయితీ

ఈ విషయమై ఆశోక్ గజపతిరాజు కలిసి సహకరించాలని కోరినా కూడ స్పందించలేదని చెప్పారు.మాన్సాస్ పై చట్టప్రకారంగానే ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు.

సిరిమానోత్సవంలో తమకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ బుధవారం నాడు ఆనందగజపతిరాజు విగ్రహం వద్ద ఊర్మిళ గజపతిరాజు ఆమె తల్లి సుధలు మౌన దీక్ష చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమను అవమానించడాన్ని నిరసిస్తూ వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సిరిమానోత్సవాన్ని కోటపై నుండి తిలకించడం సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారంగానే తాము కోటపై నుండి ఈ ఉత్సవాన్ని తిలకించినట్టుగా ఊర్మిళ చెప్పారు.ఈ తరహా ఘటనలు తమ కుటుంబంలో ఏనాడు చోటు చేసుకోలేదని ఆమె గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.