న్యూఢిల్లీ: ఆవ భూముల అక్రమాలపై ఏపీ హైకోర్టు సీబీతో ప్రాథమిక విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు.

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ఆయన  మీడియాతో మాట్లాడారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఆచంట నియోజకవర్గాల పరిధిలో కొన్ని గ్రామాల్లో జరిగిన భూ అక్రమాలపై ఏసీబీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆవ భూముల్లో స్థలం ఇచ్చినా ఎవరూ ఇల్లు కట్టుకోలేరన్నారు.

మాతృభాషలోవిద్యాబోధన జరగాలని నిర్ణయిస్తే ఆంగ్ల మాధ్యమం కావాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాసాలు రాయడాన్ని ఆయన తప్పుబట్టారు.రాష్ట్రంలో ఇసుక ప్రజలకు అందుబాటులో లేదన్నారు. ప్రస్తుతం ఇసుకకకు రూ. 20 నుండి రూ.22 వేలు చెల్లించాల్సి వస్తోందన్నారు.ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

also read:వైసీపీకి రఘురామ కౌంటర్: రాజీనామా చేస్తే మూడు రెట్ల ఎక్కువ మెజారిటీతో గెలుస్తా

విశాఖపట్టణంలో కాపులుప్పాడ వద్ద 30 ఎకరాల గ్రేహౌండ్స్ భూమిని స్టేట్ గెస్ట్ హౌస్  నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ కు బదలాయించడం కోర్టు ధిక్కారం కాదా అని ఆయన ప్రశ్నించారు.