వైసీపీ నాయకులు అడవులలోని ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని టీడీపీ నాయకుడు బోండా ఉమా ఆరోపించారు. అందుకే అడవిలో ఉండాల్సిన చిరుతలు బయటకు వస్తున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీపై సంచలన విమర్శలు చేశారు.

వైసీపీలో ‘పుష్ప’లు ఎక్కువ అయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. వారంతా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, అందుకే అడవిలో ఉండే చిరుతలు బయటకు వస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు ఎర్రచందనం కోసం అడవులను నరికివేస్తున్నారని ఆరోపించారు. అందుకే చిరుత పులులు తిరుమలలో ప్రజలు నడిచే మెట్ల బాటలోకి వస్తున్నాయని తెలిపారు. 

చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తే.. అందులో చచ్చిన ఎలుక వచ్చింది.. తింటుండగా గమనించడంతో..

కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి కర్ర ఇస్తామని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై కూడా బోండా ఉమా విమర్శలు చేశారు. భక్తులకు టీటీడీ ఇచ్చే కర్రతో ప్రభుత్వానికే బడితే పూజ చేయాలని సూచించారు. శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవానికే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. 

సూట్ కేస్ లా మడత పెట్టే సత్యనారాయణ వ్రత పీఠాన్ని తయారు చేసిన కార్పెంటర్.. ఫిదా అయిన మంత్రి కేటీఆర్..

అనంతరం వైసీపీపై కూడా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ విజన్ డాక్యుమెంట్ ఇచ్చిందని తెలిపారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి బాటలో నడిపించాలనే విషయంలో తాము ఆలోచిస్తున్నామని, కానీ ఎంత మందిని జైలుకు పంపాలని వైసీపీ ఆలోచిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీకి విజన్ అంటే కూడా ఏమిటో తెలియదని ఆరోపించారు. 

దారుణం.. భార్యకు విడాకులిచ్చి తనతో ఉంటాడని ప్రియుడి కుమారుడిని చంపిన ప్రియురాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడని వైసీపీ చెబుతోందని ఉమా అన్నారు. కానీ అధికారంలో ఉన్న ఈ నాలుగున్నరేళ్లు ఆయన అవినీతి నిరూపించకుండా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిజంగానే అవినీతికి పాల్పడితే.. సీఎం జగన్ ఇంత కాలం ఊరుకే కూర్చునేవాడా అని అన్నారు. ఎన్ని విచారణలు జరిపినా టీడీపీ అధినేత ను ముట్టుకోలేకపోయారని తెలిపారు.

గోరక్షకుడు బిట్టు బజరంగీ మళ్లీ అరెస్టు.. సాదాసీదా దుస్తుల్లో వచ్చి, హడావిడిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఈ నాలుగున్నర సంవత్పరాల కాలంలో అధికార పార్టీ నాయకులు పది లక్షల కోట్ల రూపాయిలు దోచుకున్నారని బొండా ఉమా ఆరోపించారు. సీఎం జగన్ అబద్దాలు చెప్పారని అన్నారు. మళ్లీ అవే మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు నవరత్నాలు అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.