చిలకలూరిపేట: సొంత అక్క కొడుకును అతి దారుణంగా హతమార్చిందో సైకో లేడీ. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంటింట్లోని చాకుతో బాలుడి కడుపును చీల్చిన సైకో పేగులను బయటకు తీసి మెడకు వేసుకోవడమే కాదు రక్తాన్ని తాగింది. అయితే ఈ సైకో లేడీ బారినుండి మరో ముగ్గురు చిన్నారులు సురక్షితంగా భయటపడ్డారు. 

ఈ  దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  చిలకలూరిపూట  మండలం లింగంగుంట్ల గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో షేక్ సలాం, ఆషా దంపతులు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ఇటీవల ఆషా చెల్లి ఫాతిమా భర్తతో గొడవపడి పిల్లలను తీసుకుని అక్క వద్దకు వచ్చింది. 

అయితే బాపట్లలో పని వుండటంతో తమ పిల్లలను ఇంట్లోనే చెల్లి ఫాతిమా వద్ద వుంచి వెళ్లింది ఆషా. ఇలా ఇంట్లోనే తన పిల్లలతో పాటు అక్క పిల్లలను ఆడిస్తున్న ఫాతామాకు ఒక్కసారిగా ఏమయ్యిందో ఏమో గాని సైకోలా మారింది. అక్క కొడుకు కరీముల్లాను పట్టుకుని చితకబాదడమే కాకుండా ఒంటింట్లో వున్న కూరగాయలను తరిగే కత్తితో అతి దారుణంగా కడుపులో పొడిచింది. అంతటితో ఆగకుండా కడుపు నిలువునా చీల్చి పేగులను మెడలో వేసుకుని రక్తాన్ని తాగింది. 

read more   విషాదం: దిమ్మె పడి తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్ లో గర్భిణి మృతి

ఇలా ఫాతిమా వింత చేష్టలను చూసి భయపడిపోయిన మిగతా పిల్లలు ఓ రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. వీరిని కూడా చంపడానికి ఫాతిమా ప్రయత్నించి తలుపును బాదినా తెరుచుకోలేదు. పిల్లలు అరుస్తుండటంతో ఇంటి ఓనర్ పైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో బాలుడి శవం కనిపించింది. ఈ క్రమంలో ఫాతిమా ఓనర్ కూడా కత్తితో బెదిరించగా భయపడి బయటకు పారిపోయి ఇరుగుపొరుగు వారికి విషయాన్ని తెలిపింది. 

దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైకో లేడి బారినుండి మిగతా చిన్నారులకు కాపాడారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి సైకో లేడిని అదుపులోకి తీసుకున్నారు.