తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్విమ్స్ పద్మావతి కోవిడ్ సెంటర్ లో ప్రమాదం జరిగి మహిళ మరణించింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ప్రమాదం సంభవించింది. దిమ్మె మీద పడడంతో రాధిక అనే గర్భిణి స్త్రీ మరణించింది. ఘటనలో వృద్దురాలు గాయపడింది.

ఆ సంఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భవనం కాంట్రాక్టర్ మీద, ఇంజనీరింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేత భాను ప్రకాష్ డిమాండ్ చేశారు ప్రమాదానికి కారణమైనవారిని అరెస్టు చేయాలని ఆయన అన్నారు. భవనం పై అంతస్థు గోడ కూలి ప్రమాదం జరిగింది.

రాధిక భర్త స్విమ్స్ లోనే పనిచేస్తాడని సమాచారం. మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.