శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేగింది. దీంతో ఈ నెల 12 నుంచి ఆలయంలోకి భక్తుల్ని అనుమతించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.

తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు శ్రీకాళహస్తి ఆలయంలోకి భక్తుల్ని అనుమతించబోమని ఈవో స్పష్టం చేశారు. మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్ వచ్చింది. మరికొందరి రిపోర్టులు రావాల్సి వుంది. 

Also Read:అసెంబ్లీని బ్లీచింగ్ పౌడర్ తో నింపేస్తే ఊరుకోం...:ప్రభుత్వానికి నిమ్మల హెచ్చరిక

కాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రికార్డు స్థాయిలో 216 మందికి పాజిటివ్‌గా తేలడంతో  మొత్తం కేసుల సంఖ్య 5,029కి చేరింది.

పాజిటివ్‌గా తేలిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు 147, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. కాగా రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 77కి చేరింది.

Also Read:ఏపీలో 5 వేలు క్రాస్ చేసిన కరోనా : కొత్తగా 216 కేసులు, ఇద్దరి మృతి

ఏపీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,510 కాగా, ఇప్పటి వరకు 2,403 మంది డిశ్చార్జ్  అయ్యారు. మరోవైపు సచివాలయంలో  పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కోవిడ్ 19 సోకడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది