అనంతరపురం జిల్లా తాడిపత్రిలో స్థానిక ఎంపి జెసి దివాకర్ రెడ్డికి ప్రబోధానంద స్వామి మద్య గత కొన్ని రోజులుగా వివాదం చెలరేగుతున్న విషయం తెలసిందే. తాడిపత్రి సమీపంలోని ఈ స్వామికి చెందిన  ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు జెసి ఆరోపించారు. అంతే కాదు ప్రబోధానందను మరో డేరా బాబా అంటూ సంబోదిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అ ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించని ప్రబోధానంద తాజాగా వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కూడా జేసిపై సంచలన ఆరోపణలు చేశారు.

2003 సంవత్సరంలో తమ ఆశ్రమంలో కృష్ణ మందిరం ప్రారంభోత్సవానికి జెసి దివాకర్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు గుర్తు చేశారు. అయితే ఆ సందర్భంలో అతడు తమను డబ్బులు డిమాండ్ చేశాడనీ...అందుకు తాను నిరాకరించినట్లు ప్రబోధానంద తెలిపాడు. దీంతో అప్పటినుండి తనపై, ఆశ్రమంపై జెసి కక్షగట్టాడని ఆరోపించారు. అందువల్లే తమ ఆశ్రమం పక్కనున్న గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ఉసిగొల్పాడని అన్నారు. 

జెసి ఆరోపిస్తున్నట్లు ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదని ప్రబోధానంద స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలే జరిగితే భక్తులు ఇంత పెద్దఎత్తున ఎలా వస్తారని ప్రశ్నించారు. ఐఎఎస్, ఐపిఎస్ లు కూడా తన ఆశ్రమానికి వస్తుంటారని ప్రబోధానంద పేర్కొన్నారు. ఇకనైనా తనను వేధించడం ఆపాలని ప్రబోధానంద కోరాడు.

సంబంధిత వార్తలు

మీసం తిప్పితే హీరోవా, చూసుకొందాం,రా...:సీఐపై జేసీ

టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తాం: జేసీకి సీఐ వార్నింగ్

ప్రబోధానందస్వామి ఆశ్రమం చుట్టూ కంచె....టెన్షన్ టెన్షన్

సిఐ వార్నింగ్: జేసి ఏమన్నాడో చూడండి (వీడియో)

ప్రబోధానందస్వామి వీడియోలను బాబుకు ఇచ్చిన జేసీ

చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?

జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ

ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన