Asianet News TeluguAsianet News Telugu

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

వినాయక నిమజ్జనం సందర్భంగా చోటు చేసుకున్న చిన్న గొడవతో అనంతపురం జిల్లా చిన్నపొడమలలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. స్థానిక ప్రబోధానందశ్రమ వర్గాలు, గ్రామస్తులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని.. అది ఘర్షణకు దారి తీసింది

jc diwakar reddy protest in Tadipatri police station
Author
Tadipatri, First Published Sep 16, 2018, 4:20 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వినాయక నిమజ్జనం సందర్భంగా చోటు చేసుకున్న చిన్న గొడవతో అనంతపురం జిల్లా చిన్నపొడమలలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. స్థానిక ప్రబోధానందశ్రమ వర్గాలు, గ్రామస్తులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని.. అది ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పెట్రోలు బాటిల్స్‌తో దాడులు చేసుకున్నారు.

ఈ దాడిలో పదిమంది గ్రామస్తులకు తీవ్రగాయాలవ్వగా.. కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి.. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. దాడి విషయం తెలుసుకున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లారు.

జేసీ అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు మరింత రెచ్చిపోయారు.. ఆశ్రమంపైకి రాళ్లు దాడికి పాల్పడ్డారు.. అనంతరం జేసీ తన వర్గీయులతో కలిసి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. గ్రామస్తులపై దాడికి పాల్పడిన ప్రబోధానందశ్రమం వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశ్రమం ముందు నుంచి గణేశ్ విగ్రహాలను తీసుకెళ్లకూడదని స్వామిజీ అనుచరులు చెప్పడం, గ్రామస్థులు ఆ మాటలను లెక్క చేయకపోవడంతో ఘర్షణ చెలరేగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios