తాడిపత్రి:తాడిపత్రికి సమీపంలోని చిన్నపొలమాడ వద్ద ఉన్న ప్రబోధానందస్వామి ఆశ్రమం వద్ద   గురువారం నాడు ఉద్రిక్తత నెలకొంది.

తాడిపత్రిసమీపంలోని ప్రబోధానందస్వామి ఆశ్రమంలోని భక్తులకు, చిన్న పొలమాడ గ్రామస్తులకు మధ్య  వారం రోజుల క్రితం గొడవ జరిగింది.అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆశ్రమంలో ఆధార్ కార్డు లేని వారిని స్వస్థలాలకు పంపించారు.

ఆధార్ కార్డ్ ఉన్నవారిని ఆశ్రమంలోనే కొనసాగిస్తున్నారు.గురువారం నాడు  ప్రబోధానందస్వామి ఆశ్రమం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు ఆశ్రమం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఈ కంచె ఏర్పాటు చేయడం వల్ల మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆశ్రమానికి భక్తులు ఎవరూ కూడ రావొద్దని పోలీసులు కోరారు.

ప్రబోధానందస్వామికి చెందిన వీడియోలను  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అందించారు. ప్రబోధానందస్వామిపై మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఫిర్యాదు చేశారు.

ప్రబోధానందస్వామి వీడియోలను బాబుకు ఇచ్చిన జేసీ

చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?

జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ

ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ

చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా

గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన