Asianet News TeluguAsianet News Telugu

పోలీసులే ‘ఎర్ర’ దొంగలు

అసలు ఎర్రచందనం దొంగలు పోలీసుల్లోనే ఉన్నారంటూ టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు చేసిన ఆరోపణలు ఇటు పోలీసు శాఖలోనే కాకుండా అటు రాజకీయపార్టీల్లో కూడా కలకలం రేపుతున్నాయి.

Police officers  involvment in Red sanders smugling

 

ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక రాజకీయ అండదండలున్నాయన్న విషయం ఇపుడు స్పష్టమైంది. ఇంతకాలం అనుమానాలు, ఆరోపణలుగానే ఉన్న ఎర్రచందనం తెరవెనుక వ్యవహారాలు ఓ ఐజి చేసిన ప్రకటనతో వాస్తవాలయ్యాయి. ప్రపంచంలోనే అరుదైన శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులేనంటూ సదరు ఐజి కాంతారావు చేసిన ఆరోణపలతో ప్రభుత్వంలో సంచలనం మొదలైంది.

 

అసలు ఎర్రచందనం దొంగలు పోలీసుల్లోనే ఉన్నారంటూ టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు చేసిన ఆరోపణలు ఇటు పోలీసు శాఖలోనే కాకుండా అటు రాజకీయపార్టీల్లో కూడా కలకలం రేపుతున్నాయి. రాజకీయ నేతల అండదండలు లేకుండా ఎర్రచందనాన్ని స్మగ్లర్లు యధేచ్చగా తరలించుకుపోయే అవకాశాలు లేవన్నది వాస్తవం. ఇదే విషయమై ఎప్పటి నుండో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్ధానికి నేతల అండదండలు లేకుండా ఎక్కడి నుండో వచ్చే స్మగ్లర్లు రెచ్చిపోయే అవకాశాలు లేవన్నది బహిరంగ రహస్యం. స్మగ్లర్లకు సహకరించేవారిలో నేతలేకాకుండా అటవీ, పోలీసు తదితర శాఖల అధికారులు కూడా ఉన్నారని బయటపడింది.

 

ఓ ఎస్పీ స్వయంగా పోలీసు వాహనంలోనే ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ  తమకు పట్టుబడినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తాము ప్రభుత్వానికి తెలిపినా ఆయనకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని ఆక్రోసించారు. ఫైలుకు రూ. 5 లక్షలు తీసుకుని అనుమతులు ఇచ్చే మరో ఎస్పీకి కూడా పదోన్నతులతో పాటు ప్రభుత్వం ప్రశంసలు లభిస్తున్నాయని ఆవేదనతో వ్యక్తం చేసారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు క్షేత్రస్ధాయిలో కష్టపడేవాళ్ళకేమో నిరంతరం చివాట్లు మాత్రమే లభిస్తున్నట్లు చెప్పారు.

 

పేరుకు మత్రమే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టాలని ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ వేసింది. లక్షల హెక్టార్లలో విస్తరించిన ఎర్రచందనం చెట్లను కాపాడేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన సిబ్బంది కొద్దిమంది మాత్రమే. అదే విషయాన్ని కాంతారావు మాట్లాడుతూ, తాను, ముగ్గురు డిఎస్పీలు, ఇద్దరు సిఐలు కొద్దిమంది కానిస్టేబుళ్ళు ఏ విధంగా స్మగ్లింగ్ ను అరికట్టగలమని వేసిన ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

 

తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రదొంగలను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత స్మగ్లింగ్ 80 శాతం తగ్గిందన్నారు. మిగిలిన 20 శాతం తగ్గటానికి అవసరమైన సమన్వయం కుదరటం లేదని చెప్పటం గమనార్హం. కాగా పార్టీలకు అతీతంగా ఎర్రదొంగలకు పలువురు నేతలు మద్దతు ఇస్తున్నారంటూ ఎప్పటి నుండో అరోపణలు వినిపిస్తున్న సంగతి విధితమే.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios