సీరియల్ కిల్లర్స్: పోలీసులకు చుక్కలు చూపి ఇలా దొరికారు

Police nab gang accused in murder cases
Highlights

పోలీసులకు చుక్కలు చూపిన నిందితులు దొరికారు

కడప:కడప జిల్లా ప్రొద్దుటూరులో మహిళల మిస్సింగ్, హత్యల కేసులో కీలక నిందితులైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును మూసివేసినట్టు ప్రకటించిన పోలీసులు చివరకు నిందితులను అరెస్ట్ చేశారు.

2013లో ప్రొద్దుటూరులో మహిళల మిస్సింగ్ తో పాటు ఆనవాళ్ళు లేకుండా మహిళల మృతదేహాలు లభ్యం కావడం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడేవారు. 

ఎలాంటి ఆనవాళ్ళు కూడ లభ్యం కాకుండా నిందితులు జాగ్రత్తపడ్డారు. మూడు మాసాల్లో ముగ్గురు మహిళలు హత్యకు గురికవడం తీవ్ర సంచలనానికి ఆనాడు కారణమైంది. 
ఎలాంటి ఆధారాలు లేవనే కారణంగా ఈ కేసును అప్పట్లోనే మూసివేయాలని పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా నిందితులను అరెస్ట్ చేసేందుకు గాను ఈ కేసుపై ఎస్పీ నిఘాను ఏర్పాటు చేశారు.  పఠాన్‌ అబ్దుల్‌కలాం, షేక్‌ మహ్మద్‌ ఇషాక్‌, ఒనిపెంట ఆలియాస్‌ షేక్‌గౌస్‌లాజమ్‌‌లు ముఠాగా ఏర్పడి ఒంటరి మహిళల నుండి బంగారు ఆభరణాలను దోచుకొని వారిని హత్య చేసేవారు. 

 
అయితే ఈ మూడు హత్యల తర్వాత నిందితులు రూట్ మార్చారు. దేవాలయాల్లో హుండీలు దోచుకోవడం ప్రారంభించారు. దేవాలయాల్లో చోరీలపై 8 కేసులు నమోదయ్యాయి. అయితే దేవాలయాల్లో దోపీడికి సంబంధించిన కేసు విషయంలో వీళ్ళు పట్టుబట్టారు. అయితే  విచారణ సమయంలో 2013 సీరియల్ మర్డర్ల విషయాన్ని కూడ బయటపెట్టారు.


 

loader