అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలువురు టిడిపి నేతలను ముఖ్యమైన కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Also read:రాజధానిపై రేపు కీలక ప్రకటన: క్షణ క్షణం.. హైటెన్షన్

 ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పోలీసుల హౌస్ అరెస్టులు కొనసాగాయి.  గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Also read:అమరావతి:అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టనున్న సర్కార్

 ఆదివారంనాడు ఉదయమే పలువురు టిడిపి నేతలకు టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, టిడిపి ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన ఛలో అసెంబ్లీని నిర్వహిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్ ఐజీ హెచ్చరించారు.

Also read:బాబుకు షాక్: టీడీఎల్పీ భేటీకి గంటా, వాసుపల్లి, 12 మంది ఎమ్మెల్సీల డుమ్మా

Also read:వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు

 రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా టిడిపి నేతలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు రమణమూర్తి ప్రభుత్వ వెంకటరమణమూర్తి ను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు అనంతలక్ష్మి హౌస్ అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని టిడిపి డిమాండ్ చేసింది .