Asianet News TeluguAsianet News Telugu

పోలీసులు త‌ర‌లివ‌చ్చారు

  • మంగళగిరికి మారిన పోలీసు శాఖలు.
  • మంగళగిరి పోలీసు హెడ్ క్వార్టర్స్ త్వరలో ప్రారంభం.
  • 16 తేదీన ప్రారంభించనున్నా సీఎం చంద్రబాబు.
police headquarters shift to hyderabad to andhrapradesh


 రాష్ట్రానికి పోలీసు శాఖ‌లు త‌ర‌లివ‌చ్చాయి. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు హైద‌రాబాద్ కేంద్రంగా పోలీసు శాఖ‌లు ప‌నులు నిర్వహించాయి. కానీ మంగ‌ళ‌గిరిలో నూత‌న పోలీసు హెడ్ క్యార్ట‌ర్స్‌ నిర్మాణం పూర్త‌యింది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండే నేరుగా పోలీసు శాఖ‌లు విధులు నిర్వ‌హించ‌నున్నాయి. 


 మంగ‌ళ‌గిరి లో ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్‌ను లక్షా పదివేల చదరపు అడుగుల్లో నిర్మించారు. దీనిలో పోలీసుల‌కు సంబంధించిన డీజీపీ, సీఐడీ, ఇంట‌లీజెన్స్‌, ట్రాఫిక్‌ విభాగాలు ఉండబోతున్నాయని ఎపీ పోలీస్ డైరెక్టర్ జనరల్ నండూరి సాంబశివరావు  తెలిపారు. ఆయ‌న ఒక మీడియా తో మాట్లాడుతూ  ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో పోలీసు విభాగం ఇక‌ పూర్తిగా ఆంధ్ర నుండే పాల‌నా కొన‌సాగుతుందని సాంబ‌శివ‌రావు తెలిపారు. నూత‌న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో టెక్నాల‌జీ విభాగం, క‌మాండ్ కంట్రోల్ రూమ్‌, మూడు కాంఫారేన్స్ హాళ్లు ఉన్న‌ట్లు ఆయ‌న పెర్కోన్నారు. నూత‌న టెక్నాల‌జీ హాంగుల‌తో ఈ హెడ్ క్వార్ట‌ర్స్ త‌యారు చేశామ‌ని ఆయ‌న పెర్కోన్నారు.  


త్వ‌ర‌లో రాష్ట్రం వ్యాప్తంగా 100 మోడల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇప్పటికే 40 అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇందులో పూర్తిగా ప్ర‌జ‌ల‌తో ప్రెండ్లి వాతావ‌ర‌ణంలో పోలీసులు వ్య‌వ‌హారిస్తార‌ని ఆయ‌న తెలిపారు. పోలీసు వ్యవస్థలో ప‌లు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నట్టు సాంబశివరావు తెలిపారు.

 ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్‌ను ఈనెల 16న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios