అమరావతి: విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రథంపై ఉన్న మూడు సింహాల విగ్రహాల చోరీ ఘటనపై  పురోగతి కన్పించింది.  ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వెండి రథంపై మూడు సింహాల విగ్రహాలు చోరీకి గురైన ఘటనపై పోలీసులకు దుర్గగుడి ఈవో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వెండి రథంపై మూడు సింహాల విగ్రహాలు చోరీకి గురైన ఘటనపై  దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాన్ని గుర్తించారు.

also read:విజయవాడ కనకదుర్గ రథంపై సింహాల ప్రతిమల చోరీ: ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన

ఈ ఏడాది జూన్ 26న రెండు సింహాల విగ్రహాలు చోరీకి గురైనట్టుగా గుర్తించారు. ఆ తర్వాత మూడు రోజులకు మరో రెండు విగ్రహాలను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. 

అయితే 29వవ తేదీన ఒక్క విగ్రహం మాత్రమే నిందితులు తీసుకెళ్లారు. మరో విగ్రహం తొలగించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఆ విగ్రహాం రాలేదు. దీంతో దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రథంపై ఉన్న నాలుగు విగ్రహాల్లో ఒక్క విగ్రహం మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయింది. మిగిలిన మూడు విగ్రహాలు చోరీకి గురైయ్యాయి.