అమరావతి:  విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథంపై మూడు సింహాల ప్రతిమలు చోరీకి గురైన ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకొంది. ఫోరెన్సిక్ అధికారులు  సోమవారం నాడు రథాన్ని పరిశీలించారు.విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథంపై మూడు సింహాల విగ్రహాలు చోరీకి గురైన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఈ విషయమై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ జాయింట్ అడిషనల్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్లు రథాన్ని పరిశీలించారు. రధం నుండి వేలి ముద్రలను సేకరించారు. 

also read:విజయవాడ దుర్గగుడి సింహాల ప్రతిమల మాయం: ఇంజనీరింగ్ శాఖ అధికారుల తప్పిదమేనా

రథం వద్ద పనులు నిర్వహించిన కార్మికుల నుండి కూడ పోలీసులు సమాచారాన్ని సేకరించారు. అన్ని కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.  సింహాల ప్రతిమలు ఎవరు చోరీ చేశారనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సింహాల విగ్రహాల చోరీపై ఫోరెన్సిక్ నిపుణులు  పోలీసులకు నివేదిక ఇవ్వనున్నారు.ఈ నివేదిక పోలీసుల విచారణలో కీలకం కానుంది.