Asianet News TeluguAsianet News Telugu

మంత్రిని కూడా పోలీసులు లెక్కచేయలేదు

  • కార్యక్రమం జరుగుతున్న వేదికకు అల్లంత దూరంలోనే పోలీసులు మంత్రిని నిలిపేసారు.
  • కార్యక్రమం దగ్గరకు వెళ్ళటానికి మంత్రి కారును పోలీసులు అనుమతించలేదు.
  • వాహనాలు పోకుండా రోడ్డుపై అడ్డంగా బ్యారికేడ్లను పెట్టేసారు.
  • బ్యారికేడ్లను తొలగించమని మంత్రి ఎంత చెప్పినా పోలీసులు వినలేదు.
Police did not allow minister ayyanna to participate in a programme

రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు చేదు అనుభవం ఎదురైంది. తాను మంత్రినని చెప్పినా పోలీసులు వినకుండా ఆయన్ను కార్యక్రమం జరిగే చోటుకు అనుమతించలేదు. ఇంతకీ జరిగిందేమిటంటే, శనివారం ఉదయం అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అయితే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా వచ్చారు. కాకపోతే కాస్త ఆలస్యమైంది.

అయితే, కార్యక్రమం జరుగుతున్న వేదికకు అల్లంత దూరంలోనే పోలీసులు మంత్రిని నిలిపేసారు. వేదిక దగ్గరకు వెళ్ళటానికి మంత్రి కారును పోలీసులు అనుమతించలేదు. వాహనాలు పోకుండా రోడ్డుపై అడ్డంగా బ్యారికేడ్లను పెట్టేసారు. బ్యారికేడ్లను తొలగించమని మంత్రి ఎంత చెప్పినా పోలీసులు వినలేదు.  తాను మంత్రినని, బారికేడ్లు తీయమని చెప్పినా పోలీసులు వినలేదు.  ఎస్పీ ఆదేశిస్తే తప్ప బారికేడ్లు తీసేది లేదని పోలీసులు స్పష్టంగా చెప్పటంతో అవమానంగా భావించిన మంత్రి కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనక్కు వెళ్ళిపోయారు. పైగా అయ్యన్నపాత్రుడు గుంటూరు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కూడా కావటం గమనార్హం.

 

Follow Us:
Download App:
  • android
  • ios