అతను ఆడపడుచు భర్త. వరసకు సోదరుడు అవుతూ ఉంటాడు. పనిమీద వచ్చిన ప్రతిసారి సదరు మహిళ ఇంటికి  వచ్చి వెళుతూ ఉండేవాడు. వరసకు చెల్లి అవుతుందని తెలిసి కూడా ఆ కామాంధుడు.. బావమరిది భార్యపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో సదరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆరికిరేవుల గ్రామానికి చెందిన ఓ రామారావు( పేర్లుమార్చాం)  ఇటీవల వివాహమైంది. అతనికి ఓ సోదరి కూడా ఉంది. ఆమెకు కూడా వివాహమైంది. సోదరి, బావ సుబ్బారావు( పేర్లుమార్చాం) లు ఉండ్రాజవరం మండలం సూర్యారావు గ్రామంలో ఉంటూ.. చీటీల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Also Read ప్లాట్ ఫాంపై మహిళ ప్రసవం... పారిశుద్ధ్య కార్మికులు దుప్పట్లు తెచ్చి..

కాగా... చీటీల వ్యాపారం పేరిట సుబ్బారావు  తరచూ ఆరికి రేవులలో ఉండే  బావమరిది ఇంటికి వస్తూ ఉండేవాడు. గత నెలలో కూడా అదేవిధంగా సుబ్బారావు బావమరింది రామారావు ఇంటికి వచ్చాడు. అయితే... ఆ సమయంలో బావమరిది ఇంట్లో లేడు. ఎప్పటి నుంచో బావమరిది భార్యపై కన్నేసిన సుబ్బారావు... ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అవకాశంగా తీసుకున్నాడు.

సోదరి వరస అయ్యే సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి ఫోటోలు తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఫోటోలు బయటపెడతామంటూ బెదిరించాడు. దీంతో మహిళ ఎవరికీ చెప్పుకోలేకపోయింది. గత నెల 31వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా... ఇటీవల తన బాధను భర్త, అత్తమామలకు మహిళ తెలియజేసింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.