పోలీసులు వైసీపి కార్యకర్తల ఇళ్ల పై దాడులు. వైసీపి ఖండించిన పట్టించుకొని పోలీసులు ఇంట్లో ఉన్న డబ్బను సీజ్ చేస్తున్న పోలీసులు తాజాగా ఆంధ్ర మెడికల్ షాపుపై దాడులు.
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచాకాలు కొనసాగుతున్నాయి. వైసీపి నేతల ఇళ్ల పై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు టీడపీ కౌన్సలర్ల ఇళ్లపై, మరో ఇద్దరు వైపీసీ కార్యకర్తల పై పోలీసులు దాడులు నిర్వహించారు. వాళ్ల ఇళ్లలో దొరికిన ప్రతి పైసకు లెక్కలు చూపించిన పోలీసులు డబ్బును సీజ్ చేశారు. ఈ దాడులను వైసీపి నేతలు ఎన్ని సార్లు అభ్యంతరం చెప్పిన పోలీసుల ఆగడాలు మాత్రం ఆగటం లేదు.
తాజాగా బుధవారం అర్ధరాత్రి వైసీపి నేత ఆంధ్ర మెడికల్ షాపు పై దాడులు నిర్వహించారు. దాడుల అనంతరం అక్కడ దొరికిన మూఉన్నర లక్షలు సీజ్ చేశారు పోలీసులు. ఇదే విషయం పై రమేష్ మాట్లాడుతూ. ...పోలీసులు తన షాపు పై, ఇంటి పై దాడులు చేశారని పెర్కోన్నారు. నిద్రలో ఉన్నప్పుడు తమ ఇంటి అద్దాలు పగలగొట్టి మరీ పోలీసులు నిద్రలేపారని ఆయన తెలిపారు. పోలీసుల దౌర్జన్యంగా తమ షాపు పై, ఇంటి పై దాడులు నిర్వహిస్తున్నారని ఆయన వాపోయారు. షాపులో ఉన్నమూడు లక్షల యాబై మూడు వేలు సీజ్ చేశారని తెలిపారు. అందులో ఉన్న డబ్బు తమ షాపుది రూ. 83000 ఉన్నాయని, మిగతాది లయన్స్ క్లబ్ డబ్బని ఆయన తెలిపారు. పోలీసులు సీజ్ చేసిన డబ్బుకి నయా పైసతో సహా లెక్కలు ఉన్నాయని రమేష్ తెలిపారు. పోలీసులకు ఎంత చెప్పిన వినడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు వ్యాపారి రమేష్.
వ్యాపారి రమేష్ పై దాడి ని వైసీపి నేతలు ఖండించారు. నంద్యాల్లో టీడీపీ ప్రభుత్వం గుండాయిజం చేస్తుందని ఆరోపించారు వైసీపి నేత కోలగట్ల వీరభద్ర స్వామీ, వైసీపి నాయకుల పై కావాలని దాడులకు పాల్పడుతుందని ఆయన అన్నారు. అర్థ రాత్రులు వైసీపి నేతల ఇళ్ల పై దాడులు చేసి బెదిరింపులకు పాల్పుపడుతున్నారని ఆయన పెర్కొన్నారు. అయినా వైసీపి నేతలు బాబు చేసే దాడులకు భయపడరని ఆయన తెలిపారు. చంద్రబాబు దౌర్జన్యాలు మానుకోవాలని సూచించారు.
మరి కొందరు వైసీపి నేతలు రమేష్ పై దాడిని ఖండించారు. టీడీపీ కావాలని కుట్రలు చేస్తుందని వారు అన్నారు. తక్షణమే తమ దౌర్జన్యాలను ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకొక తప్పదని వైసీపి నేతలు హెచ్చరించారు.
