వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై దాడి ఘటనలో తాజాగా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ.. ఆ ప్రాంత రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సచివాలయానికి వెళ్తున్న సీఎం జగన్ కి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై కూడా తమ నిరసన వ్యక్తం చేశారు

AlsoRead బ్రహ్మణి కి అమ్మఒడి డబ్బులు... సీఎంకి లోకేష్ థ్యాంక్స్.. పోస్ట్ వైరల్

గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు... ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు బైఠాయించిన ఆందోళనకారులు... రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు దాడి చేశారు. 

ఈ ఘటనలో ఇప్పటికే పలవురిని పోలీసులు అరెస్ట్ చేయగా... తాజాగా.. మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. తుళ్లూరుకు చెందిన షేక్.ఆసిఫ్, షేక్.ఖాసింలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిద్దరినీ మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు పోలీసులు చెప్పారు.