Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మణి కి అమ్మఒడి డబ్బులు... సీఎంకి లోకేష్ థ్యాంక్స్.. పోస్ట్ వైరల్

 జగన్ ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఏపీలోనే అమలవుతున్న ఈ అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ సోషల్ మీడయాలో ఫేక్ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు కొందరు ఆకతాయిలు. 

Ex Minister Lokesh Fire on YCP Leaders Over Amma vodi program
Author
Hyderabad, First Published Jan 10, 2020, 11:53 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమరావతిగా ఉన్న రాజధానిని తరలించే పనిలో అధికార ప్రభుత్వం ఉండగా... అలా చేయడానికి వీలులేదంటూ  రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ ఆందోళనలు, వివాదాలు, అరెస్టులను పక్కన పెట్టి.. మరో వివాదంలోకి   మాజీ సీఎం చంద్రబాబు కోడలు బ్రహ్మణి, మనవుడు దేవాన్ష్ లను కొందరు నెటిజన్లు లాగేశారు. 

AlsoRead మధ్యాహ్న భోజన పథకంలో జగన్ మార్క్: నోరూరిస్తున్న కొత్త మెనూ...

ఇప్పుడు బ్రహ్మణి, దేవాన్ష్ ల  అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఏపీలోనే అమలవుతున్న ఈ అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ సోషల్ మీడయాలో ఫేక్ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు కొందరు ఆకతాయిలు. 

అంతేకాదు.. దీనికి సంబంధించిన కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఇక నారా లోకేష్.. తన అధికారిక ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఓ ట్వీట్ కూడా ఎడిట్ చేశారు. తమకు రూ. 15 వేలు అకౌంట్‌లో వేసినందుకు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు పోస్ట్ చేశారు. అయితే ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న నారా లోకేష్.. ఈ ఫేక్ పోస్ట్‌లపై స్పందించారు.

Ex Minister Lokesh Fire on YCP Leaders Over Amma vodi program

అమ్మ ఒడి పథకం కింద తన సతీమణి నారా బ్రాహ్మణి అకౌంట్‌లో రూ.15000 జమ చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఉన్న పోస్ట్ ఫేక్ అని స్పష్టం చేశారు. ఇదంతా వైసీపీ శ్రేణులు ఆడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు. 

“మీ పిచ్చి డ్రామాలు నా దగ్గర కాదు… జగన్ ముందు వేసుకోండి. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది” అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

 మరో ట్వీట్ లో 5 రూపాయల కోసం ముష్టి కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే తనకు జాలివేస్తోందని పేర్కొన్నాడు. అమ్మ ఒడిపేరిట బొమ్మ చూపిస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన రూ.6వేల కోట్లను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. ప్రతి బిడ్డకు అమ్మ ఒడి అన్నారని.. ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటున్నారని చెప్పారు. సగానికి సగం అర్హుల సంఖ్యను కోసేశారని ఆరోపించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios