ఏలూరు: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడనే నెపంతో  ఓ భార్య  భర్తకు సైనేడ్ కలిపిన కూరను వడ్డించింది.చివరిక్షణంలో ఈ విషయాన్ని పసిగట్టిన భర్త  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా  భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన గోవింద్‌ గురునాథ్‌ పాల వ్యాపారం చేస్తుంటాడు.అతని భార్య రాణి చిన్న దుకాణం నడుపుతోంది. భర్తపై ఆమె అనుమానం పెంచుకొంది. వేరే మహిళతో గురునాథ్ వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని  భార్య రాణి అనుమానించింది.

పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ అతడిని వేధిస్తోంది. తనకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదని గురునాథ్ చెప్పినా వినిపించుకోలేదుఈ క్రమంలోనే తనను మోసం చేస్తున్న భర్తను చంపేయాలని రాణి నిర్ణయించుకుంది.

ఇందుకు కుమారుడితో పాటు అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మి, శ్రీనివాసరావు సలహా తీసుకుంది. సైనేడ్ తినిపిస్తే ఎవరికీ అనుమానం రాదని ఆమెకు కొందరు సలహా ఇచ్చారు. దీంతో సైనైడ్ కలిపిన భోజనం పెట్టి భర్తను చంపాలని రాణి నిర్ణయం తీసుకొంది.

Also read:వివాహేతర సంబంధం:గుంటూరులో సీఐ వెంకట్ రెడ్డి సస్పెన్షన్

ద్వారకాతిరుమల మండలం జాజులకుంటకు చెందిన గంటా మోజెస్‌ సహకారంతో సైనేడ్‌ తెచ్చారు. దాన్ని ముందు కోడిపుంజుపై ప్రయోగించగా సఫలమైంది. 
అయితే తన కోడిపుంజు రంగు మారిపోవడంతో గురునాథ్ అనుమానం వ్యక్తం చేశారు.తెగులు సోకి చనిపోయిందని రాణి నమ్మించింది. 

ఆదివారం భర్త కోసం మటన్ కూర వండిన రాణి అతడికి పెట్టింది. అయితే బయట వ్యక్తులు సైనేడ్ గురించి మాట్లాడుకోవడం విన్న గురునాథ్‌కు భార్యపై అనుమానం వచ్చింది. అనుమానంతోనే మొదటి ముద్ద తినగానే గురునాథ్‌కు అనుమానం వచ్చింది. 

Also read:హైద్రాబాద్‌లో విచారణ పేరుతో తల్లీ కూతుళ్లతో ఎస్ఐ వివాహేతర సంబంధం

వెంటనే గురునాథ్‌ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మటన్ కూరను స్వాధీనం చేసుకుని పరీక్ష చేయగా సైనేడ్ కలిసినట్లు తేలింది.