వివాహేతర సంబంధం:గుంటూరులో సీఐ వెంకట్ రెడ్డి సస్పెన్షన్

గుంటూరు జిల్లాలో సీఐ వెంకట్ రెడ్డి వివాహేతర సంబంధం కారణంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఐజీ నిర్ణయం తీసుకొంది. 

CI Venkat Reddy suspends for extra marital affair with woman in Guntur district


గుంటూరు: గుంటూరు జిల్లాలో  మరో పోలీసు అధికారి భాగోతం వెలుగు చూసింది. ఇప్పటికే ఇద్దరు ఎస్ఐలు మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. తాజాగా సీఐ వెంకట్‌రెడ్డిపై ఐజీ వేటేశారు.

Also read:హైద్రాబాద్‌లో విచారణ పేరుతో తల్లీ కూతుళ్లతో ఎస్ఐ వివాహేతర సంబంధం

గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న సీఐ వెంకట్ రెడ్డి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  గుంటూరు రేంజీ ఐజీ విచారణ జరిపారు. విచారణలో మహిళతో సీఐ వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టుగా  అధికారులు గుర్తించారు.

గుంటూరు జిల్లా అరండల్‌పేట ఎస్ఐ బాలకృష్ణ ఘటన  జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎస్ఐ బాలకృష్ణతో పాటు ఆయనకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.ఈ  ఘటన మరువకముందే మరో ఎస్ఐ కూరపాటి నాగేంద్రపై కూడ ఓ యువతి లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఎస్ఐ తనను లైంగికంగా వేధింపులు పాల్పడినట్టుగా బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో వైపు సీఐ వెంకట్ రెడ్డిపై కూడ ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios