పవన్ కు జగన్ అభిమాని వార్నింగ్..అరెస్టు (వీడియో)

First Published 14, Dec 2017, 2:38 PM IST
Police arrested jagans fan for warning pawankalyan
Highlights
  • వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిమాని తియ్యగూర వెంకట్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిమాని తియ్యగూర వెంకట్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఎందుకు అరెస్టు చేశారు? అంటే, సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు రెడ్డి వార్నింగ్ ఇచ్చారట. ‘జగన్ కోసం చావటానికైనా లేదా ఎవరిని చంపటానికైనా రెడీ’ అంటూ పవన్ కు వార్నింగ్ ఇస్తూ ఫేస్ బుక్ లో బుధవారం ఓ వీడియో అప్ లోడ్ చేసాడు. దాంతో పోలీసులు రెడ్డిని అరెస్టు చేశారు. అసలు రెడ్డికి పవన్ పై ఎందుకు అంత కోపం వచ్చింది? అంటే, ఇటీవలే జగన్ ను ఉద్దేశించి పోలవరం పర్యటన సందర్భంగా పవన్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. దాంతో రెడ్డికి కోపం వచ్చిందట. అందుకే పవన్ కు వార్నింగ్ ఇస్తూ సెల్ఫీ వీడియో తీసి ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. దాంతో  గుంటూరు పోలీసులు రెడ్డిని అరెస్టు చేశారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ముగ్గురుని అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా మరో జగన్ అభిమానిని అరెస్టు చేసారు.

 

 

 

loader