Asianet News TeluguAsianet News Telugu

పోలవరం ప్రాజెక్టుకు డెడ్ లైన్ ... కేంద్రం అప్పట్లోగా పూర్తిచేయమంటోంది.. : చంద్రబాబు నాయుడు  

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరంకు భారీగా నిధులు కేటాయించింది కేంద్ర కేబినెట్. ఈ క్రమంలోనే ఎప్పుడు ఏ పనులు చేయాలో కూడా నిర్ణయించిన కేంద్రం ఎప్పట్లోపు పూర్తిచేయాలో షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం పోలవరం ఎప్పటికే పూర్తికానుందంటే... 

Polavaram Project to Be Completed by 2027: Central Government Directs Andhra Pradesh AKP
Author
First Published Aug 28, 2024, 10:27 PM IST | Last Updated Aug 28, 2024, 10:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ పై నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి వరాలు కురిపించింది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే పోలవరం నిర్మాణం, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుపై కూడా హామీ ఇచ్చింది. ఈ హామీలపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ బేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.  నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతితో పాటు పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. 

ఇక బడ్జెట్ లో కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతాల్లో భారీ పారిశ్రామిక హబ్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా వీటికి కూడా కేబినెట్ ఆమోదం లభించింది.  కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,137 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నారు. దీంతో 54 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిచనున్నాయని తెలిపారు. ఇక కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ను 2,621 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.  ఇందుకోసం రూ.12,000 కోట్లు ఖర్చు చేయనున్నారు... తద్వారా 45వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రకటించింది. 

కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందం స్పందించారు. ఇది చాలా సంతోషకరమైన విషయమని... ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి ఊతమిచ్చే నిర్ణయం... నమ్మకం, భరోసా పెరిగిందన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కు 2024-25 కు ఆరువేల కోట్లు, 2025-26 కు మరో 6,157 కోట్లు... మొత్తంగా రూ.12వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఏ పనులు ఎప్పటివరకు చేయాలో కూడా కేబినెట్ సూచించిందని... 2026-27 మార్చ్ లోగా పోలవరంను పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios