నా మిత్రుడు చంద్రబాబు సిక్సర్లు కొట్టారు : ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రోడ్ షో, బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్దికి సంబంధించి ఆయన ఆసక్తికర ప్రసంగం సాగించారు.
Narendra Modi : విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ప్రధాని ప్రసంగానికి ముందు చంద్రబాబు మాట్లాడారు... ఈ సందర్భంగా ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ మోదీని కొనియాడారు. ప్రధాని మోదీ సహకారంతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని... ఆయన గ్లోబల్ లీడర్ అంటూ ఆకాశానికెత్తారు. ఈ ప్రసంగం ప్రధాని మోదీని ఆకట్టుకున్నట్లుంది... అందువల్లే చంద్రబాబు ఇవాళ సిక్సర్లు కొట్టారని మోదీ పేర్కొన్నారు.
విశాఖపట్నంలో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ది పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసారు ప్రధాని మోదీ. అలాగే మరికొన్ని ప్రారంభోత్సవాలు చేసారు. అనంతరం ప్రసంగం ప్రారంభించారు మోదీ. ముందుగా భారతమాతకి జై అంటూ ప్రసంగం ప్రారంభించారు. అయితే ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరెత్తిన ప్రతిసారి కరతాళధ్వనులు మోగాయి.
ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు... నా అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించిందని ప్రధాని అన్నారు. సింహాచలం వరాహక్ష్మీనరసింహస్వామికి నా నమస్కారం అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రజల ఆశీర్వాదంతోనే దేశంలో మూడోసారి ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిందని... ఆ తర్వాత జరుగుతున్న మొదటి కార్యక్రమం ఇది అన్నారు. మీరు చూపించిన స్వాగతానికి నేను ముగ్దుడిని అయ్యానని అన్నారు.
తనకంటే ముందు మాట్లాడిన చంద్రబాబు అన్నీ సిక్సర్లు కొట్టారు... ఆయన ఒక్కో మాట, ఒక్కో శబ్దం తనకు బాగా అర్ధమయ్యాయని ప్రధాని అన్నారు. ఆయన పేర్కొన్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తామని... ఎన్డిఏ కూటమి ఆ దిశగానే ప్రయాణం సాగిస్తుందన్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ లో అనేక అవకాశాలున్నాయి... వాటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామన్నారు. రాష్ట్రం వికసిస్తే ఆటోమేటిగ్గా దేశం కూడా వికసిస్తుందని అన్నారు. అందువల్ల ఆంధ్ర అభివృద్దే మా విజన్... ప్రజల సేవ మా లక్ష్యం అన్నారు ప్రధాని.
2047 కల్లా ఏపీని 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని... ఆ దిశగా ఏపీకి కావాల్సిన సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు లక్షల కోట్లతో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 2 లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం... ఇది రాష్ట్ర భవిష్యత్ ను మార్చే చర్యగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐటీ,సాంకేతికతకు కేంద్రంగా ఏపీ వుంది... ఇప్పుడు కొత్త టెక్నాలజీలకు సెంటర్ గా మారాల్సిన అవసరం వుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ అలాంటి రంగమే అని అన్నారు. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని...ఇందుకోసం దేశంలో రెండు హబ్ లను ఏర్పాటచేస్తే అందులో ఒకటి విశాఖకు వచ్చిందన్నారు. భవిష్యత్ లో విశాఖ ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతుందని... ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ తో అనేక ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.
ఇక బల్క్ డ్రగ పార్కులు దేశంలో మూడింటిని ప్రతిపాదించాం...అందులో ఒకటి ఇక్కడికి వచ్చిందన్నారు. ఇప్పటికే ఫార్మా రంగంలో ముందున్న ఏపీకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ...ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను తెచ్చిపెడుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
ఏపీలో పట్టణీకరణ బాగుందని... దీనివల్ల చాలా అవకాశాలు వస్తాయన్నారు. నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా ఇప్పుడు శంకుస్థాపన చేసిన క్రిస్ సిటీ నిలుస్తుందన్నారు. ఏపీలో దీనివల్ల వేలకోట్లు పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని ప్రధాని తెలిపారు. శ్రీసిటీ వల్ల తయారీ రంగం అభివృద్ది చెందింది... ఇలా ఏపీ తయారీరంగంలో అగ్రగామిగా నిలబడాలన్నారు. భారత్ మొబైల్ తయారీ రంగంలో ఉన్నత స్థానంలో వుందన్నారు మోదీ.
కొత్తగా విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి కూడా పునాది వేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. చాలా రోజులుగా ఏపీ ప్రజలు రైల్వే జోన్ అడుతున్నారు...ఆ కల ఇప్పుడు నెరవేరబోతోందన్నారు. ఇప్పటికే ఏపీకి 7 వందే భారత్ ట్రైన్లు, ఇంకా అమృత్ భారత్ ట్రైన్లు ఇచ్చామన్నారు. సుసంపన్న ఆధునిక ఆంధ్రకు కట్టుబడి వున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేసారు.
- AP political events 2025
- Andhra Pradesh News
- Andhra Pradesh development projects
- Andhra Pradesh political rally
- Andhra University public meeting
- BJP TDP JanaSena alliance
- BJP TDP JanaSena unity
- Chandrababu Pawan with Modi
- Chandrababu sixers
- Modi Chandrababu Pawan Kalyan Roadshow
- Modi Chandrababu unity
- Modi Vizag Tour
- Modi in Visakhapatnam
- Modi praises Chandrababu Naidu
- Modi rally in Andhra Pradesh
- Modi speech in Andhra Pradesh
- Narendra Modi
- PM Modi AP tour
- PM Modi Chandrababu comments
- Pawan Kalyan
- TDP Janasena BJP
- Visakhapatnam public meeting 2025
- Visakhapatnam rally highlights
- Visakhapatnam roadshow 2025
- Visakhapatnam roadshow highlights