(వీడియో) రాసలీలల ఎస్సై నుండి ప్రాణహాని...మొత్తుకుంటున్న ఓ భర్త

Person claiming husband of  hanuman junction SIs paramour feels theat to life
Highlights

  • రాసలీలల ఎస్సై విజయకుమార్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతొంది.
  • పోలీసులు విచారణ జరుపుతుండగానే రాత్రి పొద్దుపోయిన తర్వాత సాయితేజ పేరుతో ఓ వీడియో+ఆడియో పోస్టు విడుదలైంది.

రాసలీలల ఎస్సై విజయకుమార్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతొంది. కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్-2ఎస్సైగా పనిచేస్తున్న విజయకుమార్ రాసలీలలంటూ కొన్ని ఫొటోలు గురువారం వెలుగు చూసాయి. దాంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమయ్యింది. ఒకవైపు దసరా పండుగ హడావుడి, ఇంకోవైపు ఇంద్రకీలాద్రిపై దుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న వివిఐపిల తాకిడి. అటువంటి సమయంలో ఎస్సై ఫొటోలు బయటపడటంతో వెంటనే జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి వెంటనే ఎస్సైని వేకెన్సీ రిజర్వ్ లోకి పంపి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఎస్సై వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఎలా బయటకు వచ్చాయో ఎవరికీ అర్ధం కాలేదు. దానిపై పోలీసులు విచారణ జరుపుతుండగానే రాత్రి పొద్దుపోయిన తర్వాత సాయితేజ పేరుతో ఓ వీడియో+ఆడియో పోస్టు విడుదలైంది. దాంతో పోలీసులు మరింత ఇరకాటంలో పడ్డారు.  ఈ వీడియోలో సాయితేజ అనే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుని మాట్లాడుతూ, జంక్షన్ ఎస్సైతో ఉన్న మహిళ తన భార్యేనంటూ చెప్పారు. వారిద్దరి వల్ల తన ప్రాణాలకు హానివుందంటూ మొత్తుకున్నారు. వాళ్ళిద్దరూ తనను మర్డర్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైతే పోస్టు బయటపడిందో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు.

 ఎస్సై వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి నివేదిక అందచేయలని ఎస్పీ ఆదేశించారు. మూడేళ్ళుగా వీళ్ళిద్దరికీ సంబంధం వున్నట్లు సమాచారం. సదరు మహిళ నూజివీడులో ఓ బ్యూటిషిన్ గా పనిచేస్తున్నారట. భర్తకు తెలియటంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా మొదలైంది. అప్పుడు ఎస్పై కల్పంచుకుని భర్తకు సర్ది చెప్పటంతో గొడవ మరింత పెరిగింది. ఒకవైపు గొడవ జరుగుతున్నా, వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూనే ఉన్నారట. దాంతో వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నపుడు భర్తే వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాకు లీక్ చేసారన్నది తాజా ఖబర్. పోలీసులు కూడా రంగంలోకి దిగారు కదా ? చూడాలి ఏం చేస్తారో ?

loader