ఏపి సమస్యల పరిష్కారిని పూర్తి మద్దతు పలికిన నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవితకు పవర్ స్టార్ ధన్యవాదాలు తెలిపారు. తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రప్రభుత్వం ఏపి ప్రయోజనాల విషయంలో గానీ విభజన చట్టం అమలు గురించి గాని కనీస ప్రస్తావన కూడా లేదు. దాంతో వారం రోజులుగా ఏపిలో జనాలు, పార్లమెంటులో ఎంపిలు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు.

అదే సమయంలో లోక్ సభలో కవిత మాట్లాడుతూ, విభజన చట్ట ప్రకారం ఏపికి జరగాల్సిన న్యాయంపై గట్టిగా మాట్లాడారు. ప్రజల మనోభావాలను మన్నించి విభజన చట్టాన్ని అమలు చేయటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని సున్నితంగా చురకలంటించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చటమే ప్రస్తుత ప్రభుత్వ ధర్మమని చెప్పారు.

 

అదే విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపి ప్రజలకు మద్దతుగా నిలబడిన కవితకు తాను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు.