పెద్ద నోట్లను రద్దు చేసి యావత్ దేశాన్ని రోడ్డుపై పడేసిన అసలు పటేల్ (ప్రధాని)ను వదిలేసి కేంద్రం చెప్పినట్లు చిలకపలుకులు పలుకుతున్న ఉర్జిత్ ను అంటే ఏమిటి ఉపయోగం?

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచన ఎవరికీ అర్ధం కావటం లేదు. జరుగుతున్న విషయాలకు, తాను మాట్లాడుతున్న మాటలకు కొద్దిగానైనా సంబంధం ఉండేట్లు చూసుకుంటే బావుంటుంది.

అదే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న వారిని వదిలేసి అమలు చేస్తున్న వారిని పవన్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. మరి పవన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కావటంవ లేదు.

ఇందుకు రెండు ఉదాహరణలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటదిః ప్రత్యేకహోదా. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నా, ఇవ్వకూడదన్నా నిర్ణయం ప్రధానమంత్రిదే. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నది మోడినే.

అయితే, పవన్ మాత్రం కేంద్రమంత్రి వెంకయ్యనాయడుపై విరుచుకుపడుతున్నారు.

ఈ విషయంలో వెంకయ్యను ఎంత విమర్శించినా ఉపయోగం లేదు. కాకపోతే, రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేకహోదా విషయంలో బాగా హైలైట్ అయ్యింది వెంకయ్యే కాబట్టి ఇపుడందరూ వెంకయ్యపైనే పడ్డారు. మామూలు జనాలు వెంకయ్యను తిట్టుకుంటే ఏమోలే అనుకోవచ్చు.

భాజపాతో బాగా సన్నిహిత సంబంధాలున్న పవన్ కూడా సాధారణ ప్రజల్లాగే మాట్లాడితే ఎలాగ.

అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణామాలపై పవన్ ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఏదో పటేల్ దే అన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు.

పెద్ద నోట్లను రద్దు చేసి యావత్ దేశాన్ని రోడ్డుపై పడేసిన అసలు పటేల్ (ప్రధాని)ను వదిలేసి కేంద్రం చెప్పినట్లు చిలకపలుకులు పలుకుతున్న ఉర్జిత్ ను అంటే ఏమిటి ఉపయోగం?

పవన్ కు నిజంగా దమ్ముంటే, ప్రశ్నింకే ధైర్యముంటే ప్రత్యేకహోదా అయినా పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలపై నేరుగా మోడినే ప్రశ్నిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో.