తిరుపతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాపై ప్రశంసలు కురిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమిత్ షా లాంటి వ్యక్తులు దేశానికి సరైన వారని చెప్పుకొచ్చారు. 

అమిత్ షా ఉక్కుపాదంతో మనుషులతో మాట్లాడతారని అందువల్లే ఆయన లాంటి వారు అవసరమన్నారు. మెత్తగా మాట్లాడితే మనుషులు వినరని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అందువల్లే తాను మెత్తగా మాట్లాడుదలచుకోలేదని కఠినంగానే మాట్లాడతానని చెప్పుకొచ్చారు. 

చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ న్యాయవాదుల సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రాయలసీమను  కొన్ని గ్రూపులు కబ్జా చేసుకున్నాయంటూ ఆరోపించారు. వారే రాయలసీమను పాలించాలని మిగిలిన వారు అడుగుపెట్టకూడదన్నదే వారి లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. 

రాయలసీమలో మూడో వ్యక్తి ఎవరైనా వస్తే అక్కడ పనులు నడవు, మాట వినరన్న అనుమానం ఆ నేతల్లో నెలకొంటుంది అని అన్నారు. ఎంత కబ్జా చేసుకున్నప్పటికీ వారు కూడా మనుషులేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 

మొండోడు, జగన్ కులానికే మానవత్వమా: పవన్

తనను పొడిస్తే రక్తం ఎలా వస్తుందో, మిమ్మల్ని పొడిచినా కూడా అదే రక్తం వస్తుందన్నారు. కానీ మాట్లాడటానికి గుండె ధైర్యం కావాలని చెప్పుకొచ్చారు. ఎంతటి గుండె ధైర్యం అంటే తన తలకాయ ఎగిరిపడినా పర్వాలేదు అన్నంతగా ఉండాలని ఉంటుందన్నారు. అంతలా తాను తెగించి రాజకీయాలకు వచ్చానని చెప్పుకొచ్చారు. 

బీజేపీలాంటి పెద్ద పార్టీలు ఉన్నాయని వాటికి సంస్థాగతంగా బలోపేతం అయ్యిందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. కానీ జనసేన సంస్థాగతంగా బలోపేతం కాలేదని చెప్పుకొచ్చారు. ఏదైనా మాట్లాడేటప్పుడు తనను అధికార పార్టీ నీకున్న ఎమ్మెల్యేల సంఖ్యను చూసి మాట్లాడుకోవాలంటున్నారని చెప్పుకొచ్చారు. 

పార్టీని బలోపేతం చెయ్యలేక కాదని తాను నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వందమందిని కూర్చోబెడితే 150 గ్రూపులు ఉన్నాయని, అది తన ఏడుపు అని చెప్పుకొచ్చారు. తాను సెల్ఫీల కోసమో, ఫోటోల కోసమో రాజకీయాల్లోకి రాలేదని దేశంపై ఉన్న పిచ్చి ప్రేమతో వచ్చానని తెలిపారు. 

దెబ్బలు తింటాను, తల ఎగిరిపోయినా పర్వాలేదు: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

దేశంపై ఎంత ప్రేమ ఉంటే ఇంతలా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సమాజం అంటే పిచ్చి అని చెప్పుకొచ్చారు. తాను ఏమీ చెయ్యలేక అర్థరాత్రి పూట నిస్సహాయతతో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 
  
మనస్సాక్షిని తాను నమ్ముకుంటానని తెలిపారు. తన మనస్సాక్షియే తనకు దేవుడు అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తనకు గెలుపు, ఓటములు పెద్దగా తెలియవని వాటిని తాను రుచి చూడలేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. 

జగన్! చేతకాకపోతే గద్దె దిగు, ఎన్నికల్లో తేల్చుకుందాం: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు