సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. చినకాకాని వద్ద జాతీయ రహదారిని అనుకొని ఉన్న పొలాలను పరిశీలించారు. అనంతరం కాజ టోల్ గేట్ సమీపంలో నిర్మిస్తున్న నివాస సముదాయాలను యజమానులతో కలిసి పరిశీలించారు. అదే ప్రాంతంలో నిర్మిస్తున్న తన ఇల్లు, పార్టీ కార్యాలయ నిర్మాణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన నేతలతో సమావేశమై.. రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణాల పనులు, అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా పవర్‌స్టార్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.