ఫ్యాన్స్‌ కష్టాలు...అతి కష్టం మీద క్వారీ బాధితులను పరామర్శించిన పవన్‌

First Published 6, Aug 2018, 1:18 PM IST
pawan kalyan stuck with fans at kurnool
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన అభిమానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో 12 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన అభిమానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో 12 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు.

ఇవాళ క్వారీలో పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు పవన్ వచ్చారు. పవర్‌స్టార్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు,  జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకోవడంతో క్వారీ మొత్తం అభిమానులతో నిండిపోయింది. వీరిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అభిమానుల దిగ్బంధం కారణంగా పేలుళ్లతో పగుళ్లొచ్చిన ఇళ్లను పరిశీలించేందుకు పవన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పేలుడు  ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించకుండానే పవన్ నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగాడు. 
 

loader