Asianet News TeluguAsianet News Telugu

చెప్పుతో నన్ను నేను కొట్టుకునేవాడిని: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  పవన్ కళ్యాణ్ తాను పార్టీ ఎందుకు పెట్టానో వివరించారు. పార్టీ పెట్టి ఓడిపోయినా తరువాత వాస్తవానికి ఆ ఓటమి బాధలో వేరే ఎవరైనా ఉండి ఉంటే... వారు ఈ పాటికి పార్టీని వదిలేసి పారిపోయేవారని అన్నారు. 

Pawan kalyan says he would have slapped him with a slipper
Author
Rajahmundry, First Published Mar 14, 2020, 4:07 PM IST

జనసేన పార్టీ 6వ ఆవిర్భావసభ నేడు రాజమండ్రిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన ముఖ్యనాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  పవన్ కళ్యాణ్ తాను పార్టీ ఎందుకు పెట్టానో వివరించారు. పార్టీ పెట్టి ఓడిపోయినా తరువాత వాస్తవానికి ఆ ఓటమి బాధలో వేరే ఎవరైనా ఉండి ఉంటే... వారు ఈ పాటికి పార్టీని వదిలేసి పారిపోయేవారని అన్నారు. 

కానీ తాను మాత్రం పార్టీని పెట్టి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నానని అన్నాడు. పార్టీ పెట్టి ఏమి సాధించానని ఎవరన్నా అడిగితే తాను చాలానే సాధించానని సంతోషం ఉందని అన్నారు. 

Also ready: జాకెట్లలో దాచుకున్నా లాక్కుంటున్నారు: స్థానిక ఎన్నికల తీరుపై బాబు వ్యాఖ్యలు

పార్టీ పెట్టకుండా ఉండి ఉంటే... సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి చంపేశారన్న అన్నప్పుడు తాను కూడా ఒక సాధారణ వ్యక్తిలా ఏమి చేస్థామమ్మా పాడు సమాజం అనుకోను అయ్యో పాపం అనే వాడిని అని అన్నాడు. 

కాకపోతే ఆమెను పంపించిన తరువాత రూంలోకి వెళ్లి తలుపులు వేసుకొని కుమిలిపోయేవాడిని అని, సాధారణ మనిషిలాగ బాధపడి చెప్పు తో కొట్టుకునే వాడినని అన్నాడు. పార్టీ పెట్టబట్టే ఆ సమస్యపైన పోరాటం చేయగలిగామని అన్నాడు. పార్టీ పెట్టడం వల్లే ఉద్దానం నుంచి ప్రీతీ సుగాలి వరకు అనేక సమస్యలపైనా పోరాటం చేయగలిగినట్టు స్పష్టం చేసారు పవన్ కళ్యాణ్. 

ఇక ఇదే సభలో మాట్లాడుతూ... దిశా ఉదంతంపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్.  వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితులు రౌడీలు కాబట్టి వారిని కాల్చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

రెసిడెన్షియల్ స్కూల్ కు వెళ్లి రేప్ చేసేవారిని ఏం చేయాలని ఆయన సుగాలీ ప్రీతి కేసును ఉద్దేశించి అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటైన సభలో ఆయన శనివారంనాడు ప్రసంగించారు. రెసిడెన్షియల్ స్కూల్ కు వెళ్లి రేప్ చేస్తే ఎవరూ మాట్లాడరని, ఆధారాలున్నా చర్యలు తీసుకోరని ఆయన అన్నారు 

Also read: జగన్ హిట్లర్ కన్నా గొప్పవాడా...? వైసీపీకి నాగబాబు పంచ్

సుగాలీ ప్రీతి తల్లి నిస్సహాయత చూస్తే గుండె చలించిందని, అటువంటి నిస్సహాయులకు అండగా నిలబడాలనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. పిరికివాడిగా తాను బతకలేనని ఆయన అన్నారు.

ప్రజలు తనను వదిలినా తాను ప్రజలను వదలబోనని ఆయన అన్నారు. వ్యవస్థలో మార్పు రావాలని ఆయన అన్నారు. తాను మాట్లాడబట్టే సుగాలీ ప్రీతి కేసు సిబీఐ దాకా వెళ్లిందని ఆయన చెప్పారు.  

జనసేన లేకపోతే ఆ ఆ కేసు బయటకు రాదని, వందలాది జరుగుతున్నా ఒక్క కేసు ఎందుకు పట్టుకుంటామంటే స్ఫూర్తి రావాలని అని ఆయన అన్నారు. అటువంటి నేరాలు చేసేవారిలో భయం పుట్టాలని ఆయన అన్నారు. తనకు ఓటువేసినా వేయకపోయినా యువతలో అగ్ని ఉందని, న్యాయం జరగాలనే తపన ఉందని ఆయన అన్నారు. యువతలో అగ్ని ఉంది కాబట్టే అనంతపురంలో తన కార్యక్రమానికి 30 వేల మందికి పైగా వచ్చారని ఆయన చెప్పారు. 

తాను వెళ్లబట్టే గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం సుగాలీ ప్రీతి కేసును సిబీఐకి అప్పగించిందని ఆయన అన్నారు. ప్రజలను ఉత్తేజపరిచి ఏకతాటిపైకి తెచ్చే శక్తి జనసేనకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు ఏవైనా వాటి పరిష్కారానికి తాను ప్రజల వెంట ఉంటానని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios