జనసేన పార్టీ 6వ ఆవిర్భావసభ నేడు రాజమండ్రిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన ముఖ్యనాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 

ఈసభలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న, జనసేన పార్టీ నాయకుడు నాగబాబు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు దిగజారిపోయాయని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కొట్టడం కత్తులతో పొడవడం లాంటి భయపెట్టే చర్యలకు అధికార పార్టీ దిగి ఏకగ్రీవాలుగా చేసుకుంటుందని ఆయన వాపోయారు. 

Also ready: జాకెట్లలో దాచుకున్నా లాక్కుంటున్నారు: స్థానిక ఎన్నికల తీరుపై బాబు వ్యాఖ్యలు

ఇక్కడ ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ కన్నా పెద్ద నియంత ఎవ్వరు లేరని, హిట్లర్ లాంటి వాడే పతనమయ్యాడని ఆయన అన్నారు. బండరాయి ఏదైనా ఒక దెబ్బకు పగలకపోవచ్చు, రెండు దెబ్బలకు కూడా పగలదేమో, కానీ 100వ దెబ్బకైనా పగలాల్సిందేనని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని కుళ్ళు రాజకీయాల మీద కూడా పవన్ కళ్యాణ్ వరుస దెబ్బలు వేస్తున్నాడని, ఇలా వరుస దెబ్బలకు ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ లోని కుళ్ళు రాజకీయాలు నశిస్తాయని ఆయన అన్నారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ ఏధినేత చంద్రాంబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై నిప్పులు చెరిగారు. 

ఆడపిల్లలు నామినేషన్ పేపర్లను జాకెట్లలో దాచుకుని వెళితే.. వారి  లో దుస్తుల్లో చేయిపెట్టి మరీ లాక్కుంటున్నారని ముఖ్యమంత్రి జగన్‌పై ముందు దిశ చట్టం పెట్టాలని బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం కోసం వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తారని  మండిపడ్డారు.

Also read: టీడీపీ నేతల కారుపై దాడి... నిందితుడికి బెయిల్, వార్డ్ సభ్యుడిగా నామినేషన్

పోలీసులు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలకు భయపడి ప్రజలు దొంగతనంగా తిరగాల్సిన పరిస్ధితి వచ్చిందని, గోడ దూకి జనాల ఇళ్లలోకి రారని గ్యారెంటీ ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు..

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి పట్టదా, హోంమంత్రికి పట్టదా అని ఎన్నికలను నిర్వహించే పద్దతి ఇదేనా అని ఆయన ఎన్నికల కమీషన్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, లాయర్ కిశోర్‌పై మాచర్లలో హత్యాయత్నం చేసిన ఘటనపై ఐజీ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు మండిపడ్డారు.