కాకినాడ: సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాబోయే ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతీ జనసైనికుడు కష్టపడి పనిచెయ్యాలని సూచించారు. 

నాయకులను కులాలవారీగా కాకుండా వ్యక్తితత్వం చూసి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. 15 ఏళ్లు సినీరంగంలో అసంతృప్తిగా పనిచేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో సంతోషంగా ఉన్నానన్నారు. 

ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలనేది జనసేన లక్ష్యమని పవన్ చెప్పుకొచ్చారు. తెలుగురాష్ట్రాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తనకు వెళ్లే హక్కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చెయ్యాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. మిగిలిన పార్టీలు ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతుంటే ప్రజల సమస్యల కోసం తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

మోడీ అంటే నాకేం భయం.. సొంత అన్నయ్యనే ఎదిరించా: పవన్

అందుకు సిద్ధపడ్తా, సినిమాల్లో వంద కోట్లు సంపాదిస్తే...: పవన్ కల్యాణ్

కాంగ్రెస్ తో చంద్రబాబు: జగన్ కు నష్టం, పవన్ కల్యాణ్ కు జోష్

తెలంగాణలో జనసేన పొత్తులు: తేల్చేసిన పవన్ కల్యాణ్

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదీ: మాయావతితో జరగని భేటీ

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఫోన్: చంద్రబాబుపై కోపంతోనే...

పవన్ కల్యాణ్ పై ఒత్తిడి: తెలంగాణలో 40 సీట్లపై గురి