టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు ప్రయాణిస్తున్న కారుపై ఇటీవల కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తురకా కిశోర్  గురువారం స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. బుధవారం మాచర్లలో జరిగిన దాడి నేపథ్యంలో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Also Read మాచర్లలో టీడీపీ నేతలపై దాడి: పోలీసుల అదుపులో నిందితులు.

కాగా... నిందితుడు కిశోర్ వైసీపీ పట్టణ యువజన సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గురువారం 13వ వార్డు వైకాపా అభ్యర్థిగా కిశోర్ తరపున మహంకాళి కన్నారావు అనే వ్యక్తి నామపత్రాలు దాఖలు చేశారు. ప్రస్తుతం మాచర్ల పురపాలక సంఘం ఛైర్మన్ పదవిని బీసీ జనరల్ కి కేటాయించారు. పట్టణంలోని మొత్తం 31 వార్డులకు గత రెండు రోజుల్లో కేవలం రెండు నామపత్రాలు మాత్రమే దాఖలవ్వడం గమనార్హం.

ఆ రెండు కూడా 13, 25 వార్డుల నుంచి వైసీపీ అభ్యర్థులు వేసినవి కావడం విశేషం. అయితే.. కిశోర్ కి బెయిల్ ఇచ్చినప్పటికీ... కేసు విచారణలో ఉన్నన్ని రోజులు ప్రతిరోజూ స్టేషన్ కి హాజరుకావాలని పోలీసులు  చెబుతున్నారు.