ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత జగన్‌పై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండో విడత పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీసీ కులసంఘాలు, ఆటో యూనియన్లు, బ్రాహ్మణ సమాఖ్య, మేధావుల ఫోరం తదితర సంఘాలతో పవన్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్‌లు రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారని.. సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. మనమంతా మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందనేది మీరే.. కాపులకు రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల జరిగే లాభనష్టాలపై బీసీలకు అవగాహన కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు.

భీమవరం పట్టణంలో డంపింగ్ యార్డ్ లేకపోవడం ప్రధాన సమస్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల బాధ్యతని.. కానీ జనసేన ప్రశ్నించడం ఒక్క దానికే పరిమితం కాదన్నారు.. దశాబ్ధాలుగా దెబ్బతింటూనే ఉన్నామంటే అందుకు మనలోని అనైక్యతే కారణమని పేర్కొన్నారు.. కులాల ఐక్యత అనేది ఒక ఆశయమని... మోసపోతున్నామని తెలిసి కూడా ఓట్లు వేయడం ఎందుకని పవన్ ప్రశ్నించారు.