నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ పేరు చెప్పకుండా గతంలో జరిగిన సంఘటనను ప్రస్తావించి, ఆరోపణ చేశారు.

భీమవరం: నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ పేరు చెప్పకుండా గతంలో జరిగిన సంఘటనను ప్రస్తావించి, ఆరోపణ చేశారు.

పార్టీ పోరాటయాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం కాలు బెణకడంతో భీమవరంలో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన అభిమానులతో ఆయన మాట్లాడాైరు. 

తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని అభిమానులు పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, తుపాకీతో కాల్చిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. 

బాలకృష్ణను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. 2004లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.