వాషింగ్టన్ డీసీ:  తాను ఎవరికీ గులాంగిరి చేయనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్తానని ఆయన అభిప్రాయపడ్డారు. 

వర్జీనియాలో ప్రవాసాంధ్రులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.  రాజకీయ పార్టీని నడపాలంటే చాలా కష్టాలు ఉంటాయన్నారు.డబ్బుతో ముడిపడిన రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలకు అండగా నిలబడాలనే  ప్రయాణం మొదలు పెట్టానన్నారు. కోట్లాది మంది భవిష్యత్తును నిర్ధేశించాలంటే అనుభవం కూడ కావాలన్నారు. పార్టీని స్థాపించినప్పుడే పాతికేళ్ల ప్రయాణం కొనసాగిస్తానని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన ఊపిరి ఉన్నంత వరకు పార్టీని నడిపిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

బీజేపీతో నాకు శతృత్వం లేదు: రామ్‌మాధవ్‌తో భేటీ తర్వాత పవన్

పవన్‌తో రామ్ మాధవ్ భేటీ: ఎవరైనా రావొచ్చు, జనసేనానిపై కీలక వ్యాఖ్యలు

పవన్‌తో బీజేపీ నేత రామ్‌మాధవ్ భేటీ: మతలబు ఏమిటి